- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చండూరు మున్సిపాలిటీలో ముసలం
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన చండూరు మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ ,వైస్ చైర్మన్ దోటి సుజాత పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెటాలని సొంత పార్టీ కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

దిశ,నల్లగొండ : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన చండూరు మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ ,వైస్ చైర్మన్ దోటి సుజాత పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెటాలని సొంత పార్టీ కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 27 తో మున్సిపల్ పాలక వర్గం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి అయింది. నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం పాలకవర్గం ఏర్పడి మూడు సంవత్సరాలు ముగిసిన తరువాత ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో సోమవారం ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త, ఇద్దరు బీఅరెఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరుతూ నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ప్రస్తుత బలాబలాలు
చండూరు మున్సిపాల్టీలో మొత్తం 10 వార్డులకు గాను కాంగ్రెస్ -7, బీజేపీ- 1, బీఆర్ఎస్ -2 స్థానాలలో గెలుపొందగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు తోకల చంద్రకళ చైర్మన్ గా, దోటి సుజాత వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. వీరిలో పలువురు పార్టీలు మారడం ద్వారా ప్రస్తుతం కాంగ్రెస్ నుండి ఒక్కరు, బీజేపీ నుండి ముగ్గురు, బీ ఆర్ ఎస్ నుండి ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు. సొంత పార్టీ నేతలతో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కూడా అవిశ్వాసానికి మద్దతు తెలుపు తుండటంతో చైర్మన్ మార్పు ఖాయంగా కన్పిస్తుంది. మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ, వైస్ చైర్మన్ బీజేపీ నుండి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది మునుగోడు ఎన్నిక ఫలితం ఆధారంగా ఇప్పటి నుండే అధికార పార్టీ నాయకుడికి చెక్కు పెట్టేలా నాయకులు వ్యవహరిస్తున్నారు అని స్పష్టంగా తెలుస్తుంది. చండూరు మున్సిపాలిటీ లో ప్రజల సమస్యల పై వీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందుకే వీరిపై అవిశ్వాసం పెట్టినట్లు సమాచారం.






