- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం..1500 కోట్లతో అభివృద్ధి
ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం..1500 కోట్లతో అభివృద్ధి
by Bhanu |
తుర్కపల్లి మండలం తిరుమలపూర్‌లో జూన్ 6న జరగనున్న ముఖ్యమంత్రి సభకు మండలంలోని కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని డీసీసీ అధ్యక్షులు సంజీవరెడ్డి పిలుపునిచ్చారు.

X
రాజపేట : తుర్కపల్లి మండలం తిరుమలపూర్‌లో జూన్ 6న జరగనున్న ముఖ్యమంత్రి సభకు మండలంలోని కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని డీసీసీ అధ్యక్షులు సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాజపేటలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చేయనున్నారని తెలిపారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నాయకత్వంలో ఈ భారీ బహిరంగ సభకు రాజపేట మండలం నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ గౌడ్, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
Next Story






