అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరు: రాపోలు నవీన్ కుమార్

by Disha Web Desk 23 |
అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరు: రాపోలు నవీన్ కుమార్
X

దిశ, నేరేడుచర్ల : అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరని ఇకపై ఉద్యమాల తీవ్రత అధికం అవుతుందని బీఎస్పీ జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ అన్నారు. నిరుద్యోగుల పక్షాన దీక్ష చేస్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును ఖండిస్తు ప్రధాన చౌరస్తా వద్ద కోదాడ -మిర్యాలగూడ రోడ్డుపై రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నటువంటివి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో విఫలమైందని అన్నారు.దీనిపై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరాహార దీక్ష చేస్తే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి లిక్కర్ స్కామ్ పేపర్ లీకేజీ స్కామ్‌లో దోషులను జైలుకు పంపాలన్నారు. దుండగుల పై చర్యలు తీసుకోవాలని.. అటువంటి వారిపైనే చర్యలు తీసుకోకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరాహార దీక్ష చేస్తే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో దొరల పాలనను అంతం చేసి నిరుద్యోగుల పక్షాన బహుజన సమాజ్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు జీలకర్ర రామస్వామి, పట్టణ అధ్యక్షుడు కర్రీ సతీష్ రెడ్డి, మండల కన్వీనర్ పెద్దపంగు సురేష్ బాబు, అమరవరపు వెంకటేశ్వర్లు, బీవీఫ్ కన్వీనర్ ప్రేమ్ కుమార్, పోలె వెంకటేశ్వర్లు, రాం శ్రీను, అది మల్ల బాబు తదితరులు పాల్గొన్నారు.


Next Story