Suryapeta : తల్లి గ్రామ పాలన పరీక్షలో.. బిడ్డ కానిస్టేబుల్ ఒడిలో

by Muthe.Rajitha |

నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో గ్రామ పంచాయతీ సెక్రటరీ (గ్రామ పాలన) పరీక్ష (Panchayat Secretary Exam) జరుగుతున్న సంగతి తెలిసిందే.

Suryapeta : తల్లి గ్రామ పాలన పరీక్షలో.. బిడ్డ కానిస్టేబుల్ ఒడిలో
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో గ్రామ పంచాయతీ సెక్రటరీ (గ్రామ పాలన) పరీక్ష (Panchayat Secretary Exam) జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష రాయడానికి ఓ తల్లి పసిపాపతో రాగా.. అక్కడే విధుల్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ ఆ పాపను ఎత్తుకొని ఆడించింది. ఈ ఘటన నేడు సూర్యాపేటలో చోటు చేసుకుంది. ఆదివారం సూర్యాపేట(Suryapeta)లోని గ్రామ పాలన పరీక్షకు హాజరైన ఒక మహిళా అభ్యర్థి తన చిన్నారి పాపను తీసుకొని వచ్చింది. ఆమె వెంట సహాయకులుగా ఎవరూ రాలేదు.

పాపతో పరీక్ష కేంద్రంలోకి వెళ్ళడానికి అధికారులు నిరాకరించగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సునీత ఆ పాపను ఎత్తుకొని, తల్లి ఎగ్జామ్ అయ్యేవరకు ఆడించింది. కానిస్టేబుల్ చూసిన మానవీయతను పలువురు ప్రశంసించారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. దీనిపై కానిస్టేబుల్ సునీత స్పందిస్తూ.. తాను విధి నిర్వహణలో భాగంగానే చేశానని, పరీక్ష రాసే తల్లులకు సౌకర్యాలు కల్పించడం తమ శాఖ బాధ్యత అని స్థానిక మీడియాకు తెలిపారు.

Next Story