- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, నాగారం : గ్రామాల్లో కోతులు హడలెత్తిస్తున్నాయి. కుక్కలను మించి కోతుల భయమే గ్రామస్తులను వెంటాడుతోంది. నాగారం గ్రామానికి చెందిన నూక నర్సమ్మ అనే వృద్ధురాలిని సోమవారం కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. నాగారం బంగ్లా మరియు పనిగిరి మిగతా గ్రామాలలో కోతుల బెడద తీవ్రంగా ఉన్నది. మహిళలు చిన్నారులు భయపడుతున్నారు. ఇంటి తలుపులు వేయడం మరిచారో ఇక అంతే సంగతులు కోతులు ఇళ్లలోకి చేరి వంట సామాగ్రి దుస్తులు ఆహార పదార్థాలు చిందర వందర చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్డుపై వెళ్లాలంటే జంకుతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి భయపడుతున్నారు. సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు మండల అధికారులు ప్రభుత్వం స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని నాగారం మండల ప్రజలు కోరుతున్నారు.
Next Story






