- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధ్యాయురాలు కాదు.. మార్గదర్శక దేవత..!
పట్టణాలకు దగ్గరగా పని చేయాలని చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆశపడతారు. కానీ, రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామాని

దిశ,నల్లగొండ: పట్టణాలకు దగ్గరగా పని చేయాలని చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆశపడతారు. కానీ, రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన లావూరి ఉషారాణి మాత్రం పూర్తి భిన్నంగా ఆలోచిస్తూ మారుమూల గ్రామంలో సేవలందిస్తూ, ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలుస్తున్నారు.2012లో SGTగా నియామకమైన ఉషారాణి, తన విద్యా ప్రతిభతో 2022 వరకు ఘట్టుప్పల్ ZPHSలో బయో సైన్స్ టీచర్‌గా పనిచేశారు.
అనంతరం చందంపేట మండలంలోని కాట్రావత్ తండా ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు.అక్కడ విద్యార్థుల కొరత కారణంగా ప్రస్తుతం డిప్యూటేషన్ పై గాగిల్లపురం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.గత మూడు సంవత్సరాలుగా ఉషారాణి గాగిల్లపురం గ్రామంలోనే అద్దె ఇల్లు తీసుకుని నివసిస్తున్నారు. తన కుమార్తెను కూడా తానే బోధించే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదువిస్తున్నారు.
ఇది విద్యపై ఆమె నమ్మకాన్ని,ప్రభుత్వ పాఠశాలల పట్ల గల విశ్వాసాన్ని చూపుతుంది.విధుల అనంతరం సమయాన్ని వృథా చేయకుండా,గ్రామానికి చెందిన విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెప్పడం ద్వారా అనేకమంది చిన్నారులకు విద్యలో ఆసక్తి కలిగిస్తూ, వారి జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతున్నారు.లావూరి ఉషారాణి మాదిరి ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్య వ్యవస్థకు ప్రాణాలుగా నిలుస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నారు అనడంలో సందేహమే లేదు. ఆమె సేవలు మరెంతో మంది ఉపాధ్యాయులకు ప్రేరణగా మారాలని ఆశిద్దాం.






