- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"దిశ" ఎఫెక్ట్: కాంట రిపేర్ చేయించిన జిల్లా అధికారులు
by Bhanu |
"ఎం ఎల్ ఎస్ పాయింట్ అధికారుల ఘరానా మోసం" అనే శీర్షికన "దిశ" లో వచ్చిన వార్తకు జిల్లా సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు.

X
దిశ, కేసముద్రం : "ఎం ఎల్ ఎస్ పాయింట్ అధికారుల ఘరానా మోసం" అనే శీర్షికన "దిశ" లో వచ్చిన వార్తకు జిల్లా సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే కేసముద్రం ఎం ఎల్ ఎస్ పాయింట్ లో తూకం లో వస్తున్న తేడాను గమనించిన రేషన్ డీలర్లు "దిశ" ను సంప్రదించగా అక్కడ జరుగుతున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చింది "దిశ". విషయం తెలుసుకున్న జిల్లా సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి సాంకేతిక నిపుణులతో విద్యుత్ కాంట లను సరిచేయించారు. ప్రస్తుతం అంతా సరిగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. చీకటి వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకు వచ్చి సమస్య పరిష్కరించిన "దిశ" ను రేషన్ డీలర్లు కొనియాడారు.
Next Story






