- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెక్కలు తెగిన ఆశలు.. ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఇచ్చిన మాట కొత్త ఆశగా
ఎరుగండ్లపల్లి గ్రామానికి చెందిన చామకూరి తిరుపతయ్య జీవితంలో తుఫాన్ చెలరేగింది. కుటుంబ కలహాలతో క్షణికావేశంలో అతడు విషపదార్థం తాగిన తరువాత అతడి జీవితం

దిశ, మర్రిగూడ: ఎరుగండ్లపల్లి గ్రామానికి చెందిన చామకూరి తిరుపతయ్య జీవితంలో తుఫాన్ చెలరేగింది. కుటుంబ కలహాలతో క్షణికావేశంలో అతడు విషపదార్థం తాగిన తరువాత అతడి జీవితం అర్ధాంతరంగా నిలిచిపోయింది. అప్పటి నుంచే తిరుపతయ్య అశ్రుత్వ స్థితిలో ఉండిపోయాడు.. కదలలేడు, మెదులలేడు, ఒక్క చూపుతో పాటు సొంతవాళ్లను కూడా గుర్తుపట్టలేని స్థితి.
తన కొడుకు కోసం తల్లిదండ్రులు పోరాటం చేశారు. చిన్నచిన్న పనులతో కూడిన ఆదాయం సరిపోక లక్షల రూపాయలు అప్పులు చేసి వైద్యం చేయించారు. అయినా ఆశలు నెరవేరలేదు. తమ బాధను చెప్పుకోవడానికి దేవుడూ దిక్కుగా లేడనుకున్న తల్లిదండ్రుల ముందుకి దేవుడులాంటి వ్యక్తిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వచ్చారు. గ్రామంలో మార్నింగ్ వాక్ చేస్తూ తీరని తల్లిదండ్రుల దుస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే.. తన మాటకు కట్టుబడి తిరుపతయ్యకు యశోద ఆసుపత్రిలో చికిత్స కల్పించారు.
తన భర్తను బ్రతికించాలన్న ఆశతో భార్య తన ఆభరణాలను అమ్మేసి, ఇద్దరు చిన్నపిల్లలతో జీవచ్ఛవంలా మారిన భర్తకు సేవ చేస్తూ కూలీ పని చేస్తూ జీవితం నెట్టుకుంటోంది. ఎమ్మెల్యే చేసిన మానవత్వంతో ఆ కుటుంబానికి కాస్త వెలుగొచ్చింది. ప్రస్తుతం తిరుపతయ్యకు వైద్యం జరుగుతోంది. స్థానికులు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.






