అంబేద్కర్ అందరివాడన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

by Bhanu |

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంపాటి శ్రీను ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అంబేద్కర్ అందరివాడన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
X

దిశ, కోదాడ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంపాటి శ్రీను ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని భారత పౌరులకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని ఎమ్మెల్యే అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

రాజ్యాంగానికి అనుగుణంగానే బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం నేడు అమలు చేస్తుందని, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించి, వారి అభివృద్ధికి పాటు పడుతున్నామన్నారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, కాంపాటి శ్రీను, కందుల కోటేశ్వరరావు, చింతాబాబు మాదిగ, గంధం యాదగిరి, పంది తిరపయ్య, బషీర్, పిడతల శ్రీను, గంధం పాండు, గుండపంగు రమేష్, పుల్లయ్య, శేషు, పాలూరి సత్యనారాయణ, చౌడం హనుమంతరావు, బాజాన్, జనార్దన్, అశోక్, లక్ష్మీనారాయణ, అలీ భాయ్, రహీం, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Next Story