మనస్పర్థలొద్దు మనమంతా ఒక్కటే: ఎమ్మెల్యే

by Kodari Anjali |

మీరు నా వద్దకు వచ్చినా స్వాగతిస్తా లేదా నన్ను పిలిచినా మీ ఇంటికి వస్తానంటూ ఎమ్మెల్యే మందుల సామేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మనస్పర్థలొద్దు మనమంతా ఒక్కటే: ఎమ్మెల్యే
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): మనలో మనకు మనస్పర్ధలొద్దు మనమంతా ఒకటే కలిసిరాండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే మందుల సామేల్ పిలుపు ఇచ్చారు. ఇటీవల మండల కేంద్రంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో నిరసన స్వరం వినిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి మీరు నన్ను పిలిచినా భేషజాలు లేకుండా మీ ఇంటికైనా వస్తా లేదా మీరు నా ఇంటికి వచ్చినా స్వాగతిస్తా అని పేర్కొనడం గమనార్హం. శుక్రవారం జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి గ్రామంలో రూ. 34 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే గ్రామ సమాఖ్య భవనం, కేజీబీవీ పాఠశాలలో సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం, బతుకమ్మ బండకు సీసీ నిర్మాణాలకు ఎమ్మెల్యే మందుల సామేల్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.

విబేధాలు లేకుండా అంతా కలిసి కట్టుగా ఉండి..

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో ముందంజలో నిలబెడతానని అన్నారు. కేజీబీవీ కళాశాలకు అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలను తయారుచేసి 5 రోజుల్లో అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఏఈ రంగారావును ఆదేశించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విబేధాలు లేకుండా అంతా కలిసి కట్టుగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుడిపెల్లి మధుకర్ రెడ్డి, జిల్లా నాయకులు ఇందుర్తి వెంకటరెడ్డి, వేల్పుల రమేష్, సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్, కృష్ణా నాయక్, నాయకులు కొరపిడత అవిలయ్య, జీడి వీరస్వామి, అల్వాల వెంకటస్వామి,వివేక్ రెడ్డి, బైరబోయిన సైదులు, తాటిపాముల జలెందర్,పాశం భాస్కర్ రెడ్డి, చిక్కుల శేఖర్, దలవాయి శ్రీధర్, దాసరి సోమయ్య, నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ఝాన్సీ, ఎంఈఓ బాలు, ఏపీఎం రాంబాబు, హెచ్ఎం మల్లేష్, ఎస్వో నాగరాణి, ఏఈ రంగారావు, కాంట్రాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story