- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్నింగ్ వాక్ విత్ పీపుల్’లో ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే ఆరా..
జోడుబావి తండాలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

దిశ, నేరేడుగొమ్ము: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ జోడుబావి తండా గ్రామంలో నిర్వహించిన “మార్నింగ్ వాక్ విత్ పీపుల్” కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గ్రామ సర్పంచ్ బానావత్ మంజునాథ్‌తో కలిసి ఎమ్మెల్యే గ్రామ వీధుల్లో పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన ద్వారా అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం జోడుబావి తండాలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ఈ భవనం ఉపయోగపడుతుందని, స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల కల్పనకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. తదుపరి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. రోడ్ల నిర్మాణంతో గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
సాగునీరు అందుబాటులోకి వస్తే..
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం రూ.2 లక్షల సహాయం అందిస్తుందని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేద కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పెండ్లిపాకుల ప్రాజెక్టు ద్వారా నేరేడుగొమ్ము మండలానికి త్వరలోనే సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. సాగునీరు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






