సీఎం కప్ - 2023 రాష్ట్ర స్థాయి ముగింపు పోటీలకు ఎమ్మేల్యే భగత్..

by Disha Web Desk 20 |
సీఎం కప్ - 2023 రాష్ట్ర స్థాయి ముగింపు పోటీలకు ఎమ్మేల్యే భగత్..
X

దిశ, హాలియ : సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ - 2023 రాష్ట్ర స్థాయి ముగింపు పోటీలకు ముఖ్యఅతిధులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, శాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ హాజరైనారు. ముగింపు క్రీడలలో భాగంగా రంగారెడ్డి, సూర్యాపేట ఫైనల్స్ కబడ్డీ మ్యాచ్ ను శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ ఆటను తిలకించారు. అనంతరం పోటీలలో నల్గొండ జిల్లా మహిళా కబడ్డీ టీమ్ మొదటి స్థానం సాధించిన టీం సభ్యులను ఎమ్మెల్యే నోముల భగత్ అభినందించారు. వాలీబాల్, కబడ్డీ, జిమ్నాస్టిక్, మిగతా పోటీలలో విజేతలుగా నిలిచిన, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో నిలిచిన జట్లకు మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్స్, షిల్డ్స్, నగదు బహుమతులు ప్రధానం చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ దేవుడు ఇష్టపడే అద్భుతమైన వ్యక్తులు క్రీడాకారులు మాత్రమేనని, మే" అంటే మండే ఎండలు కాదు.. మే అంటే..మా యువతరం మెరుపులు అంటూ, తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే నైపుణ్యం గల వారనీ గుర్తు చేశారు. జూన్ లో బడి బాటలాగే.. యువకులు అందరూ గ్రౌండ్ బాట పట్టాలనీ, తెలంగాణ బిడ్డలను, అన్ని విభాగాలను విజేతలుగా నిలపడం కోసమే సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారనీ, క్రీడలలో అద్భుతమైన జీవితం ఉంది అని అందరికి తెలియపరిచానని కోరారు. గుడినీ, బడిని ఎలా ప్రేమిస్తామో.. గ్రౌండ్ నీ అలాగే గౌరవించేలా చైతన్యం చేయండి.. అప్పుడే గ్రామలకు అందమైన ఆరోగ్యం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా డీఆర్ డీఓ శ్రీనివాస్ రావు, డిప్యూటీ డైరెక్టర్ ధనలక్ష్మి , స్టేడియం అడ్మినిస్ట్రేటర్ వెంకటేశ్వరావు, తెలంగాణ ఓలంపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జగదీష్ కుమార్, రంగారెడ్డి ఓలంపిక్ అసోసియేషన్ సెక్రటరీ మల్లారెడ్డి, పీఈటి అసోసియేషన్ కృష్ణ మూర్తి, జిమ్నస్టిక్ అసోసియేషన్ సోమేశ్వర్, పీడీలు, పీఈటీలు, కోచ్ లు, వేలాది మంది క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed