స్టేట్ సిట్రస్ సెమినార్–2026లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

by Kodari Anjali |

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై అవగాహన కల్పించే లక్ష్యంతో నల్గొండలో నిర్వహించిన “స్టేట్ సిట్రస్ సెమినార్–2026” కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే పాల్గొన్నారు.

స్టేట్ సిట్రస్ సెమినార్–2026లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
X

దిశ, మిర్యాలగూడ రూరల్: రాష్ట్రంలో బత్తాయి సాగు అభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై అవగాహన కల్పించే లక్ష్యంతో నల్గొండలో నిర్వహించిన “స్టేట్ సిట్రస్ సెమినార్–2026” కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో బత్తాయి సాగు ప్రధాన పంటగా మారిందని, వేలాది మంది రైతుల జీవనాధారం బత్తాయి తోటలేనని పేర్కొన్నారు. అయితే మార్కెట్ ధరల అస్థిరత, పెరుగుతున్న సాగు వ్యయాలు, ఎరువులు, పురుగుమందుల ధరల పెరుగుదలతో పాటు దిగుబడి నాణ్యతకు సంబంధించిన సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..

బత్తాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పంటల మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఎగుమతి అవకాశాలను విస్తరించాలని, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు అదనపు ఆదాయ మార్గాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించే ఆధునిక సాగు విధానాలను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని సూచించిన ఎమ్మెల్యే, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, బత్తాయి రైతులు మరియు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు.

Next Story