మరోసారి వాయిదా పడిన లెనిన్.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన నాగార్జున

by Chukka Sudharani |

అక్కినేని ఫ్యాన్స్‌ను నిరాశపర్చుతూ ‘లెనిన్’ మరోసారి వాయిదా పడింది.

మరోసారి వాయిదా పడిన లెనిన్.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన నాగార్జున
X

దిశ, సినిమా: అక్కినేని ఫ్యాన్స్‌ను నిరాశపర్చుతూ ‘లెనిన్’ మరోసారి వాయిదా పడింది. అక్కినేని హీరో అఖిల్, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోండగా.. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది. ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 26న రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్రం మరోసారి వాయిదా పడినట్లు గతకొద్ది రోజులుగా వార్తలు రాగా.. ఫైనల్‌గా వాయిదాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మేరకు అక్కినేని నాగర్జున సోషల్ మీడియాలో వేదికగా ప్రకటిస్తూ.. ‘'టీమ్ లెనిన్' నా దగ్గరకు ఒక అభ్యర్థనతో వచ్చింది. తమ వంతుగా 100% కృషి చేసి, ఇంకొంచెం బెటర్‌గా రూపొందించడానికి వారు మరికొంత సమయం అడిగారు. వారి అంకితభావం, ఉత్సాహం చూసి నేను సరేనన్నాను. జులై 10న 'మనోడు' రాబోతున్నాడు. మరోసారి చెబుతున్నాను, మీరు ఒక కొత్త అఖిల్‌ను చూడబోతున్నారు.. లెనిన్ అనుభూతి కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ తెలిపాడు.

Next Story