​కునుకు తీస్తున్న అటవీ రక్షణ.. చెక్ పోస్టులో నిద్రలో మునిగిన సిబ్బంది!

by Kodari Anjali |

అటవీ సంపద పరిరక్షణ, కలప అక్రమ రవాణా నియంత్రణ వంటి అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన అటవీ శాఖ చెక్ పోస్ట్‌లో సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది.

​కునుకు తీస్తున్న అటవీ రక్షణ.. చెక్ పోస్టులో నిద్రలో మునిగిన సిబ్బంది!
X

దిశ, బూర్గంపాడు: అటవీ సంపద పరిరక్షణ, కలప అక్రమ రవాణా నియంత్రణ వంటి అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన అటవీ శాఖ చెక్ పోస్ట్‌లో సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామంలోని ఫారెస్ట్ చెక్ పోస్టులో విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది, డ్యూటీ సమయంలోనే ఆదమరచి నిద్రలో మునిగిపోయిన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

​నిర్లక్ష్యం పరాకాష్ట.. రోడ్డుపై వాహనాలు వెళ్తున్నా పట్టించుకోని వైనం

ఈ చెక్ పోస్ట్ గుండా నిరంతరం భారీ వాహనాలు, లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే అటవీ సంపద అక్రమ రవాణా కాకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన బాధ్యత కలిగిన సదరు సిబ్బంది, కుర్చీలో వెనక్కి వాలీ టేబుల్‌పై కాళ్లు చాపి మరీ గాఢనిద్రలోకి జారుకున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. పక్కనే రోడ్డుపై పెద్ద పెద్ద లారీలు వెళ్తున్నా, కనీసం అప్రమత్తత లేకుండా నిద్రపోతుండటం అధికారుల పర్యవేక్షణా లోపాన్ని ఎత్తిచూపుతోంది. పడుకున్నా... కూర్చున్నా... నెల తిరిగేసరికి జీతం వస్తుందనే ధీమాతోనే ఈ తరహా నిర్లక్ష్యానికి పాల్పడుతున్నారా?" అంటూ స్థానికులు, ప్రయాణికులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ప్రజలు కడుతున్న పన్నుల ద్వారా వచ్చే ప్రజా ధనం నుంచి వేలాది రూపాయల వేతనాలు పొందుతున్న అధికారులు, సిబ్బంది తమ విధుల పట్ల ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మొరంపల్లి బంజర చెక్ పోస్ట్‌లో విధులను గాలికొదిలేసి నిద్రిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అటవీ సంపద లూటీ కాకుండా కఠినమైన నిఘా ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story