- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీ బిగిస్తుండగా కిందపడి ఎలక్ట్రిషన్ మృతి..
by Kodari Anjali |
మధురానగర్‌లోని ఎస్సార్ హాస్పిటల్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, సీతాఫలమండి: మధురానగర్‌లోని ఎస్సార్ హాస్పిటల్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ 5వ అంతస్తులో ఏసీ బిగిస్తున్న సమయంలో ఓ ఎలక్ట్రిషన్ ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని సమీపంలోనే ఉన్న హాస్పిటల్ వైద్యులు పరీక్షించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






