- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిప్పర్ ఢీకొని యువకుడు మృతి
by Batti.Sumithra |
వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

X
దిశ, కేసముద్రం : వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కేసముద్రం మండలంలోని బడితండకు చెందిన భూక్య నవీన్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేసముద్రం బడి తండా యువకుడు నవీన్, మహబూబాబాద్ పట్టణంలోని సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






