యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

by Kodari Anjali |

యోగా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
X

దిశ, మిర్యాలగూడ టౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమైతుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణం లోని ఎన్ ఎస్ పి క్యాంపులో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమని పేర్కొన్నారు. యోగా కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆధ్యాత్మిక వికాసానికి కూడా ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరెడ్డి నర్సిరెడ్డి, చేరుపల్లి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story