- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.80 లక్షల సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన
దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు.

దిశ, దేవరకొండ టౌన్: దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని 7వ వార్డులో రూ.80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తూ, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేవరకొండ పట్టణ పరిధిలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ వంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి వార్డులోనూ దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, పట్టణంలో చేపట్టే ప్రజా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా రాజీ పడకుండా, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మున్సిపల్ అధికారులు, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






