క్షణిక మత్తు... జీవితానికే ముప్పు..

by Bhanu |

"క్షణిక మత్తు కోసం జీవితాలను తాకట్టు పెట్టొద్దు" అంటూ నషాముక్త భారత్ అభియాన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ పి. భవాని మాదకద్రవ్యాల వినియోగం పై హెచ్చరించారు.

క్షణిక మత్తు... జీవితానికే ముప్పు..
X

దిశ, తుంగతుర్తి : "క్షణిక మత్తు కోసం జీవితాలను తాకట్టు పెట్టొద్దు" అంటూ నషాముక్త భారత్ అభియాన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ పి. భవాని మాదకద్రవ్యాల వినియోగం పై హెచ్చరించారు. ఆదివారం తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ (నషా ముక్త భారత్ అభియాన్) అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ... గంజాయి, మాదకద్రవ్యాల వాడకంతో శారీరకంగా, మానసికంగా, కుటుంబపరంగా, సమాజపరంగా అనేక దుష్పరిణామాలు వస్తాయని పేర్కొన్నారు.


క్షణిక మత్తుకు బలై యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వారి కుటుంబాలూ అనేక కష్టాలు పడుతున్నాయని తెలిపారు. యువత దేశం భవిష్యత్తుకి నిలయమని, వారి దృష్టి మత్తు పదార్థాల వైపు కాక, సమాజ నిర్మాణం వైపు ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన పెంచుకుని, సమాజాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా నుంచే దేశం మొత్తం మారాలి అనే సంకల్పంతో ముందుకు సాగాలని తెలిపారు.

Next Story