కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్ ..ఏమన్నారంటే..?

by Naveena |

బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల్లో సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు

కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్ ..ఏమన్నారంటే..?
X

దిశ,సూర్యాపేట; బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల్లో సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ కరెక్షన్ వైరస్ సోకిందన్న వ్యాఖ్యల పైన తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పందించారు.

ఆదివారం హుజూర్ నగర్ లో జరగనున్న సన్న బియ్యం ప్రారంభం సభలో పాల్గొనటానికి వెళ్తూ,సూర్యాపేటలో టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ. .బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలన్న బండి సంజయ్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. పదేళ్లుగా బిజెపికి అధికారం ఇస్తే గ్రామాల్లోకి అక్షింతలు వచ్చాయి.. తప్ప అభివృద్ధి రాలేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదేళ్లలో బిజెపి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవడానికి లేక మతం పేరుతో దేవుని పేరుతో ప్రజల మధ్య ఐక్యతను చెడగొట్టాలని చూస్తున్నదన్నారు. కరప్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ బిజెపి ప్రభుత్వమేనని ప్రధాని అంబానీలకు పేదల సంపదను దోచిపెట్టి బిజెపి నాయకులు వాటాలు తీసుకుంటున్నారని సీతక్క అన్నారు.

2013లో ఆహార భద్రత చట్టాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. బండి సంజయ్ కు బిజేపి లో గుర్తింపు సమస్య ఉందని,కాంగ్రెస్ పార్టీని తిడితే గుర్తింపు వస్తుందని బండి సంజయ్ ఆలోచన,కాంగ్రెస్ తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తినడానికి లేని రోజుల నుండి సన్నబియ్యం ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుండి పన్నుల రూపంలో ఒక రూపాయి పంపిస్తే కేంద్రం నుండి 48 పైసలే తిరిగి రాష్ట్రం నాకు వస్తున్నాయని మరి కేంద్ర ప్రభుత్వం పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు పెడతారా అని ఆమె ప్రశ్నించారు.

Next Story