- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పగిడిమర్రి సర్పంచ్ ని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి
దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : నల్గొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి పార్టీలకతంగా కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : నల్గొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి పార్టీలకతంగా కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కనగల్ మండలం పగిడిమర్రిలో నాగబెల్లి నాగమణి సైదులు సర్పంచ్ గా గెలుపొందగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన సర్పంచ్ తో పాటు పగిడిమర్రి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలోని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి గెలుపొందిన సర్పంచులు పార్టీలకతంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.






