గడ్డం అనూప్ రెడ్డిని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి

by Kodari Anjali |

కాంగ్రెస్ పార్టీ కనగల్ మండల అధ్యక్షుడు అనారోగ్యంతో నల్గొండలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

గడ్డం అనూప్ రెడ్డిని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, కనగల్: కాంగ్రెస్ పార్టీ కనగల్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి అనారోగ్యంతో నల్గొండలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. నల్గొండలోని సంరక్ష హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అనూప్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయనకు అందుతున్న వైద్య సేవలపై ఆస్పత్రి వైద్యులు చిదేటి శిశుపాల్ రెడ్డితో మాట్లాడారు. మెరుగైన వైద్య చికిత్స అందించి త్వరగా కోలుకునేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా అనూప్ రెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి ధైర్యం చెప్పి, పార్టీ శ్రేణులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, ఆర్టిఏ నెంబర్ కూసుకుంట్ల రాజురెడ్డి, తదితరులు ఉన్నారు.

Next Story