వీహెచ్ ప్రెస్ మీట్ బ్యానర్‌ పై కనిపించని మంత్రి కోమటిరెడ్డి

by Batti.Sumithra |   (  Updated:2026-04-15 08:12:07  IST  )

నల్లగొండ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో జనగణనలో జననం జరగాలి అనే అంశంపై మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ప్రెస్ మీట్ నిర్వహించారు.

వీహెచ్ ప్రెస్ మీట్ బ్యానర్‌ పై కనిపించని మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో జనగణనలో జననం జరగాలి అనే అంశంపై మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో జాతీయ నాయకులతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేల ఫోటోలు ఉంచారు. అయితే, నల్లగొండ శాసనసభ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో మాత్రం కనిపించలేదు. కైలాస్ నేత డీసీసీ పదవి చేపట్టడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అందువల్లే ప్రెస్ మీట్ బ్యానర్‌లో ఆయన ఫోటోను ఉంచలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Next Story