జీవో ఎంఎస్ 142 రద్దు చేయాలని రోడ్డెక్కిన వైద్య సిబ్బంది

by Bhoopathi Nagaiah |

వైద్య ఆరోగ్య శాఖలో హేతుబద్ధీకరణ పేరుతో డిప్యూటీ డీఎంహెచ్ వో కార్యాలయాల ఎత్తివేత, సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ ఎంఎస్ 142ను బేషరతుగా రద్దు చేయాలని 142 జీవో రద్దు కమిటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ నిరంజన్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిలు డిమాండ్ చేశారు.

జీవో ఎంఎస్ 142 రద్దు చేయాలని రోడ్డెక్కిన వైద్య సిబ్బంది
X

దిశ, కోదాడ: వైద్య ఆరోగ్య శాఖలో హేతుబద్ధీకరణ పేరుతో డిప్యూటీ డీఎంహెచ్ వో కార్యాలయాల ఎత్తివేత, సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ ఎంఎస్ 142ను బేషరతుగా రద్దు చేయాలని 142 జీవో రద్దు కమిటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ నిరంజన్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిలు డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 142 జీవోతో వైద్య ఆరోగ్యశాఖ ఉనికి కోల్పోతుందన్నారు. ప్రజల ఇంటి ముంగిటకు ఆరోగ్య సేవలు అందిస్తున్న శాఖను నిర్వీర్యం చేయడం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

142 జీవో రద్దు స్టీరింగ్ కమిటీ నాయకులు యాతాకుల మధుబాబు, అంజయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆరోగ్యశాఖలో ఇలాంటి జీవో గొడ్డలి పెట్టని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, డాక్టర్ లక్ష్మీప్రసన్న, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ నవ్య, ముక్కా శ్రీను, మహేష్, కృష్ణ, అంజన్న, డాక్టర్ వైష్ణవి, డాక్టర్ ఫర్హీన్ , త్రినాధ్, లింగయ్య, శైలజ, ఆరోగ్య కార్యకర్తలు విజయలక్ష్మి, ఇందిరా, రాధసుధా, మంగ, మహేశ్వరి, కళ్యాణి, కల్పన, మార్తా, రాధ, కళావతి , కల్పన, నీరజ, జ్యోతి, ధనమ్మ, కనకదుర్గ, వెంకటనారాయణ, శ్రీదేవి, రత్న మేరీ, సుబ్బు, సురేంద్ర, రాము, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Next Story