- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేసిన వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు
వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి, దాని స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని.. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతూ.. తుంగతుర్తి ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు బుధవారం ఆర్ఎంఓ డాక్టర్ ఉపేందర్‌కు సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

దిశ, తుంగతుర్తి: వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి, దాని స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని.. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతూ.. తుంగతుర్తి ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు బుధవారం ఆర్ఎంఓ డాక్టర్ ఉపేందర్‌కు సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడంతో.. ప్రతి నెల వేతనాలు ఆలస్యంగా రావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గతంలోనే వైద్య విధాన పరిషత్ ఉద్యోగ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం స్పందించి, వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిందని అన్నారు.
ఈ మేరకు ఏర్పాటు చేసిన కమిటీ కూడా అవసరమైన విధి విధానాలను సూచిస్తూ తన నివేదికను ఏడాది క్రితమే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినప్పటికీ ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు చేయడంతో పాటు ట్రెజరీ జీతాల పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అంతేకాకుండా సెకండరీ హెల్త్ సర్వీసెస్‌ను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా శాస్త్రీయంగా సిబ్బంది సంఖ్యను ప్రతిపాదించాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగులు కరుణాకర్, సువర్ణ, నాగమణి, అనిత, నర్సింగ్ ఆఫీసర్స్, కవిత తదితరులు పాల్గొన్నారు.






