- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం చాటుకున్న మఠంపల్లి ఎస్సై రవి..
పోలీసులు అనగానే కఠినంగా వ్యవరిస్తారని తరచూ మనం వింటుంటాం. కానీ దీనికి భిన్నంగా పోలీసులు అంటే మంచితనం, మానవత్వం కూడా ఉంటుందని సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్సై రవి నిరూపించారు.

దిశ, నేరేడుచర్ల /మఠంపల్లి: పోలీసులు అనగానే కఠినంగా వ్యవరిస్తారని తరచూ మనం వింటుంటాం. కానీ దీనికి భిన్నంగా పోలీసులు అంటే మంచితనం, మానవత్వం కూడా ఉంటుందని సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్సై రవి నిరూపించారు. వివరాల ప్రకారం.. తన పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త దోనబండతండాకు చెందిన బానోతు బాబు శనివారం విద్యుత్ షాక్ ప్రమాదానికి గురై మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన సమయంలో కేసు దర్యాప్తులో భాగంగా వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న మఠంపల్లి ఎస్సై ఇరుగు రవి చెలించిపోయారు. సోమవారం మృతిని ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు 10వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సోషల్ మీడియా ద్వారా పలువురిని కోరారు. తను ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఆ కుటుంబానికి పలువురు సాయం చేయాలని చెప్పడంతో రవికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.






