మర్రిగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్

by Chintha Aamani |

మర్రిగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి ని సస్పెన్షన్ చేస్తూ రాష్ట్ర మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆచారి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

మర్రిగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్
X

దిశ ,మర్రిగూడ: మర్రిగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి ని సస్పెన్షన్ చేస్తూ రాష్ట్ర మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆచారి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపాల్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ మంజూరైన నిధులలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలసుకు పూర్తి ఆధారాలతో పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లం పాండురంగారావు గత రెండు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పాటు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి డీఈవో బిక్షపతి కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత సోమవారం డిడి దుర్గాప్రసాద్ విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు విచారణ నివేదికను అందజేశారు. ఈ మేరకు నిధులలో ప్రిన్సిపాల్ అవినీతికి పాల్పడిందని రుజువు చేస్తూ శివస్వరూపురానిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story