- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు కింద పడి వివాహిత మృతి
by Bhanu |
రైలు కింద పడి వివాహిత మృతి చెందిన సంఘటన చిట్యాల పట్టణ కేంద్రంలో రైల్వే బ్రిడ్జి సమీపంలో బుధవారం రాత్రి జరిగింది.

X
దిశ, చిట్యాల: రైలు కింద పడి వివాహిత మృతి చెందిన సంఘటన చిట్యాల పట్టణ కేంద్రంలో రైల్వే బ్రిడ్జి సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన రూపని స్వప్న (34) బుధవారం సాయంత్రం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన బంధువుల ఇళ్లల్లో వెతకగా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం లోకో పైలట్ విధులు నిర్వర్తిస్తుండగా మహిళ మృతదేహం లభించింది. దీంతో వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ మార్చురీ కి తరలించారు. మృతురాలికి ఒక పాప, ఒక బాబు, భర్త ఉన్నారు..
Next Story






