డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ కు ఆ విషయమే కారణమా..?

by Naveena |   (  Updated:2025-04-13 15:23:54  IST  )

మండలంలోని భోగారం గ్రామానికి చెందిన కూనూరు భార్గవి (22) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ కు ఆ విషయమే కారణమా..?
X

దిశ,రామన్నపేట :మండలంలోని భోగారం గ్రామానికి చెందిన కూనూరు భార్గవి (22) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూనూరు లక్ష్మి భర్త కునూరు సుదర్శన్ గత10 నెలల క్రితం మృతి చెందాడు. తల్లి టైలరింగ్ పనిచేస్తూ.. కూతురు భార్గవిని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివిస్తుంది. ఆమె చదవు అయిపోగానే తన కూతురుకి దగ్గరి బందువుల అబ్బాయితో పెళ్లి చేస్తానని తల్లి చెప్పగా, తన కూతురు భార్గవి పై చదవులు చదవి ఉద్యోగం చేస్తానని తెలిపింది. దీంతో గత వారం రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందని తెలిపారు. రెండవ శనివారం సెలవు దినం కావడంతో.. తన కూతురు కాలేజికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంది. సాయంత్రం దాదాపు 4 గంటల సమయంలో తల్లి పక్కింటికి వెళ్ళగా.. భార్గవి ఇంట్లో చున్నితో పై కప్పు దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.మల్లయ్య తెలిపారు.

Next Story