- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏఆర్ నగర్ కాలనీలో ఉలిక్కిపడే సంఘటన జరిగింది. ఆ కాలనీకి చెందిన ఓర్సు వెంకన్న, మైసమ్మ దంపతులు. కాగా మైసమ్మ కొంత కాలంగా ఎరుకల బిక్షం అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు భర్తకు ఈ విషయం తెలిసింది. కాగా భర్త వెంకన్నకి ఆమెకు తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే భార్య, ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి భర్తను చంపినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డిని వివరణ కోరగా వారు హతుడి భార్యను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్లు మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు తెలుపుతామని వివరించారు.
Next Story






