- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనస్థాపానికి గురై ఉరివేసుకొని వ్యక్తి మృతి
అనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురై నేరేడుచర్ల పట్టణానికి చెందిన రామ్ గురుస్వామి (32) ఉరి వేసుకొని మృతి చెందినట్లు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ సోమవారం విలేకరులు తెలిపారు.

మనస్థాపానికి గురై ఉరివేసుకొని వ్యక్తి మృతి
దిశ నేరేడుచర్ల : అనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురై నేరేడుచర్ల పట్టణానికి చెందిన రామ్ గురుస్వామి (32) ఉరి వేసుకొని మృతి చెందినట్లు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ సోమవారం విలేకరులు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల పట్టణంలోని చింతబండకు చెందిన రామ్ గురుస్వామి ఆటో డ్రైవర్ గా పని చేస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.గత 5 సంవత్సరాల నుండి క్యాన్సర్ వ్యాధి బారిన పడగా ప్రస్తుతం హైదరాబాదు నందు చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై జీవితం మీద విరక్తి చెంది ఆదివారం రాత్రి స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గల ఒక చెట్టుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య రామ్ లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.






