- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాడుగులపల్లి మండలం
X
దిశ, వేములపల్లి (మాడుగులపల్లి) : కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన గుణగంటి శ్రీను (37) గత ఏడు సంవత్సరాల క్రితం పాములపాడు గ్రామంలోని రైస్ మిల్లు కొనుగోలు చేసి పాములపాడు గ్రామంలో జీవనం సాగిస్తున్నాడు. కాక గత సంవత్సర కాలం నుండి కుటుంబంలో ఆస్తి తగాదాల విషయంలో తల్లిదండ్రులు, అక్క, సోదరినితో గొడవలు జరుగుతున్నాయి. గొడవల కారణంగా మనస్థాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు, గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story






