- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మారణాయుధాలతో తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్
అక్రమంగా మారణాయుధాలతో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసిన సంఘటన భువనగిరి పట్టణ పీఎస్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : అక్రమంగా మారణాయుధాలతో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసిన సంఘటన భువనగిరి పట్టణ పీఎస్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. భువనగిరి ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణ ఎస్సై లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భువనగిరి చెరువు కట్ట వద్ద సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీలలో భాగంగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఒక వ్యక్తి వద్ద ఒక పిస్టోల్, 11 పిల్లెట్లు, ఒక పెద్ద కత్తిని ఉండడాన్ని గమనించారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకొని ఆ వ్యక్తిని భువనగిరి పట్టణానికి చెందిన రౌడీ షీటర్ మహమ్మద్ గఫూర్ అలియాస్ బాబాగా గుర్తించారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీనికి సంబంధించిన వివరాలను భువనగిరి ఇన్స్పెక్టర్ రమేష్ బుధవారం పట్టణ పీఎస్ లో వెల్లడించారు.
ఈ విచారణలో భాగంగా నిందితుడికి ఆర్థిక సమస్యలు ఉండడంతో డబ్బుల కోసం ఒకరిని బెదిరించడానికి నిర్ణయించుకున్నాడు. దీనికోసం హైదరాబాదులోని మోహంజా మార్కెట్ కు వెళ్లి అక్కడ ఒక బొమ్మ పిస్టల్, పిల్లెట్లు, అంబర్ పేట చే నెంబర్ దగ్గర ఒక పెద్ద కత్తిని కొన్నాడు. దానిని తీసుకొని ద్విచక్ర వాహనంపై భువనగిరికి వస్తుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం ఒప్పుకున్నట్లు ఇన్స్పెక్టర్ రమేష్ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా ఆయుధాలను ఉంచుకున్నట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సై కుమారస్వామి, సిబ్బంది కేశవ్ తదితరులు పాల్గొన్నారు.






