- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు

దిశ, భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలోనే ఆ వ్యక్తి దగ్గర గంజాయిని గుర్తించారు పోలీసులు. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీహార్ రాష్ట్రం బారాహి తొల సుఖసాని గ్రామానికి చెందిన తంటి మిథున్ కుమార్ (33) గత కొంతకాలంగా పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని వెల్లడించారు పోలీసులు. నిందితుడి వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.






