మనుస్మృతి ప్రతులను తగలబెట్టిన మాల మహానాడు నాయకులు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-25 12:56:40  IST  )

దిశ‌, దేవరకొండ టౌన్ : మాల మ‌హానాడు ఆధ్వ‌ర్యంలో గురువారం దేవ‌ర‌కొండ ప‌ట్ట‌ణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న

మనుస్మృతి ప్రతులను తగలబెట్టిన మాల మహానాడు నాయకులు
X

దిశ‌, దేవరకొండ టౌన్ : మాల మ‌హానాడు ఆధ్వ‌ర్యంలో గురువారం దేవ‌ర‌కొండ ప‌ట్ట‌ణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి ప్రతులను మాల మహానాడు నాయకులు తగలబెట్టారు. బహుజన మేధావి డాక్టర్ యేకుల రాజారావు, మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి మాట్లాడుతూ భారతదేశ సామాజిక చరిత్రను 'మనుస్మృతి దహనం' పూర్వం, తర్వాతి కాలంగా విభజించవచ్చు అని 1927 డిసెంబర్ 25న మహారాష్ట్రలోని మహద్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వేలాది మంది అనుచరుల తో మనుస్మృతిని దహనం చేశారు అని.. ఇది కేవలం ఒక పుస్తకాన్ని తగులబెట్టిన ఘటన కాదు. వేల ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న వర్గాల ఆత్మగౌరవ ప్రతీక. మానవ హక్కుల కోసం సాగిన ఒక చారిత్రాత్మక ధిక్కార స్వరం అన్నారు. అంబేద్క‌ర్ చవదార్ చెరువు పోరాటం , స్త్రీల అణచివేత పై పోరాటం చేసిన‌ట్టు గుర్తు చేశారు.

డిసెంబ‌ర్ 25, 1927 మ‌హ‌ద్ లో జ‌రిగిన రెండో స‌త్యాగ్ర‌హ స‌ద‌స్సులో భాగంగా డిసెంబ‌ర్ 25న మ‌న‌స్మృతిని ఉంచారు. ఇది ఒక కులం పై పోరాటం కాదు.. విలువ‌ల‌పై పోరాటం అని నిరూపించ‌డ‌నికి గొప్ప ఉదాహ‌ర‌ణ అన్నారు. నేటి ఆధునిక సమాజంలో కూడా కుల వివక్ష, స్త్రీలపై దాడులు పూర్తిగా రూపుమాసిపోలేదు. అని అన్నారు మనుస్మృతి దహనం అనేది కేవలం ఒక చారిత్రక ఘట్టం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. అమానవీయమైన ఆలోచనలను, వివక్ష చూపే భావజాలాలను మనుషుల మనసుల నుండి దహనం చేసినప్పుడే అంబేద్కర్ కలలుగన్న సమసమాజం సాధ్యమవుతుంది. డాక్టర్ అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేయడం ద్వారా భారతదేశానికి ఒక నూతన విజ్ఞాన వెలుగును అందించిందని గుర్తు చేశారు. ప్రతి ఏటా డిసెంబర్ 25ను 'మనుస్మృతి దహన దినోత్సవం'గా జరుపుకోవడం అంటే, రాజ్యాంగం అందించిన స్వేచ్ఛను, సమానత్వాన్ని గౌరవించుకోవడమే అన్నారు. ఈ కార్యక్రమంలో సల్వాది పెద్దులు, యేకుల అంబేద్కర్, గోరటి అంజి, కాలే వెంకటయ్య పాల్గొన్నారు.

Next Story