- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమించిన యువకుడు మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం
ప్రేమించిన యువకుడు మోసం చేశాడని మనస్తాపం చెందిన ఓ యువతి దేవరకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

దిశ, దేవరకొండ టౌన్ : ప్రేమించిన యువకుడు మోసం చేశాడని మనస్తాపం చెందిన ఓ యువతి దేవరకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నేరడుగోమ్ము మండల కేంద్రానికి చెందిన ఓ యువతి.. శ్రీను అనే యువకుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నట్టు సమాచారం. ఇటీవలే పులికంటి శ్రీనుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ వారి ప్రేమాయణం కొనసాగినట్టు తెలుస్తోంది. అయితే ఆ యువతి పెళ్లి చేసుకోమని శ్రీను ని కోరింది. ఆ యువకుడు ఆమె అభ్యర్థనను నిరాకరించాడు. ఈ విషయంపై శనివారం దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో ఇరువురి కుటుంబ సభ్యులు, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరుగుతుండగా.. యువకుడు పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి తన వెంట తెచ్చుకున్న డెటాల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు, పోలీసులు ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






