పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

by Nallavelli.Anjaneyulu |

దిశ, భూదాన్ పోచంపల్లి : పోయిన సెల్ ఫోన్ ను వెతికి పట్టుకొని పోలీసులు బుధవారం బాధితునికి అప్పగించారు. స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి మండల

పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత
X

దిశ, భూదాన్ పోచంపల్లి : పోయిన సెల్ ఫోన్ ను వెతికి పట్టుకొని పోలీసులు బుధవారం బాధితునికి అప్పగించారు. స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కనుముకుల గ్రామానికి చెందిన కలకొండ వెంకటేశం ఈ నెల 16న తన వ్యక్తిగత పనిమీద కనుముకుల నుండి పోచంపల్లి వైపు బైక్ పై వస్తుండగా మార్గమధ్యంలో సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. వెంటనే బాధితుడు పోచంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిర్యాదు దారుడీ నుండి పోలీసులు ఐఎంఈఐ నెంబర్ తీసుకొని సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసి పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. అనంతరం బాధితుడికి అప్పగించారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న మూడు రోజుల వ్యవధిలోనే వెతికి పట్టుకున్న పోలీసులను పలువురు అభినందించారు.

Next Story