- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్ ను ఢీకొన్న లారీ : వ్యక్తి మృతి
అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన

X
బైక్ ను ఢీకొన్న లారీ : వ్యక్తి మృతి
- అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన
- నేరేడుచర్ల మండలం పత్తేపురంలో విషాదం
దిశ గరిడేపల్లి : బైక్ ను లారీ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం పత్తేపురం గ్రామానికి చెందిన ఊరే శ్రీనివాస్ పొనుగోడులోని తన అత్తగారింటికి ఓ పని నిమిత్తం వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. ఈ క్రమంలో సూర్యాపేట వైపు నుంచి వస్తున్న లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో గరిడేపల్లి మండలం కేంద్రంలోని పొనుగోడు రోడ్డులో గల ఎంబీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద శ్రీనివాస్ ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య కళావతి, కుమార్తె ఉంది. శ్రీనివాస్ మృతితో పత్తేపురంలో విషాదం నెలకొంది.
Next Story






