- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు రూ.4.21 కోట్ల రుణమాఫీ..
మండలంలోని బేతవోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని పలువురు రైతులకు రూ.4.21 కోట్ల రుణ మాఫీ లబ్ధి చేకూరిందని ప్యాక్స్ ఛైర్మన్ బజ్జూరి రవీందర్ రెడ్డి తెలిపారు.

దిశ, చిలుకూరు: మండలంలోని బేతవోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని పలువురు రైతులకు రూ.4.21 కోట్ల రుణ మాఫీ లబ్ధి చేకూరిందని ప్యాక్స్ ఛైర్మన్ బజ్జూరి రవీందర్ రెడ్డి తెలిపారు. బేతవోలు సొసైటీ భవనంలో శుక్రవారం ప్యాక్స్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో ఎరువులు అందించామని, నూతన పంట రుణాలు రూ. 1.80 కోట్లు, స్వల్ప కాలిక రుణాలు రూ.1.14 కోట్లు రైతులకు పంపిణీ చేశామన్నారు. గోల్డ్ లోన్ లాకర్ సదుపాయం కోసం ఎన్డీసీసీ బ్యాంక్ అధికారులకు దరఖాస్తు చేశామన్నారు. పలువురు రైతులకు దీర్ఘకాలిక రుణాలు సైతం అందించామని బజ్జూరి తెలిపారు. సంఘ పరిధిలోని రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సంఘ పాలక వర్గ సభ్యులు పండ్ల శ్రీనివాస్, తాళ్లూరి ప్రసాద్, బజ్జూరి సత్యనారాయణ రెడ్డి, పాయిలి కృష్ణయ్య, దొంగరి సత్యనారాయణ, కుమ్మరి మరియమ్మ , కాంపాటి గంగయ్య , నూనావత్ శోక్లా, అనంతు ప్రమీల, సారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతులు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






