- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెల్ట్ షాపులకు జోరుగా మద్యం సరఫరా !
కోదాడ మండలంలో బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోందన్న ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

బెల్ట్ షాపులకు జోరుగా మద్యం సరఫరా !
ఎక్సైజ్ అవతారంలో వైన్ షాప్ సిబ్బంది?
కోదాడలో వాహనాల చెకింగ్‌పై చర్చ
ఆటోలు, బైకులను ఆపుతున్న సిబ్బంది
రాంపురం ఎక్స్ రోడ్, గుడిబండ వైన్ షాపుల సిండికేట్ చర్చ
దిశ,కోదాడ : కోదాడ మండలంలో బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోందన్న ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాంపురం క్రాస్ రోడ్, గుడిబండ ప్రాంతాల్లో ఉన్న కొన్ని వైన్ షాపులు సిండికేట్‌గా మారి బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపుల నిర్వాహకులు బెల్ట్ షాపుల యజమానులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.మీరు మద్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవద్దు… మా దగ్గర నుంచే కొనాలి… మీ బెల్ట్ షాపులు మొత్తం మా పరిధిలోకే వస్తాయి” అంటూ ఎక్సైజ్ అధికారుల్లా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇతర దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉండగా ఇటీవల కోదాడ పట్టణంలో ఉన్న కొన్ని వైన్ షాపులు , రూరల్ పరిధిలో ఉన్న రెండు దుకాణాల మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా విషయంలో తలెత్తిన వివాదాల కారణంగా ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలిసింది.ఈ ఘటనలో ఆటోలో తరలిస్తున్న మద్యం పట్టుబడినట్లు కూడా సమాచారం. మద్యం తరలిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో వైన్ షాపుల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయని అంటున్నారు.
వాహనాలను ఆపి తనిఖీలు...
స్థానికుల కథనం ప్రకారం కోదాడ పట్టణం నుంచి గ్రామాల వైపు వెళ్లే ప్రధాన రహదారులపై కొందరు వ్యక్తులు ఆటోలు, ద్విచక్ర వాహనాలను అడ్డగించి తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారుల్లా ప్రవర్తిస్తూ వాహనాలను నిలిపివేసి వాహనాల్లో మద్యం ఉందా లేదా అని పరిశీలించి పంపిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్నిచోట్ల రాత్రి వేళల్లో కూడా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని సమాచారం. అధికారిక హోదా లేకుండా ఈ విధంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రజలకు ఇబ్బందులు...
గ్రామాల నుంచి పట్టణానికి వెళ్లే మార్గాల్లో తరచుగా వాహనాలను ఆపి తనిఖీలు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు వాహనదారులతో వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయని, యువకులను ప్రశ్నిస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.
బెల్ట్ షాపులకు మద్యం సరఫరా...
కోదాడ మండలంలో బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాంపురం క్రాస్ రోడ్, గుడిబండ ప్రాంతాల్లో ఉన్న కొన్ని వైన్ షాపులు సిండికేట్‌గా మారి బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు...
బెల్ట్ షాపులపై ఒత్తిడి...
ఈ ప్రాంతాల్లోని కొన్ని వైన్ షాపుల నిర్వాహకులు బెల్ట్ షాపుల యజమానులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. “మద్యం మా దగ్గర నుంచే కొనాలి… ఇతర దుకాణాల నుంచి కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటాం” అంటూ ఎక్సైజ్ అధికారుల్లా హెచ్చరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో బెల్ట్ షాపుల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.
వైన్ షాపుల మధ్య గొడవలు...
ఇటీవల కోదాడ పట్టణంలో ఉన్న కొన్ని వైన్ షాపులు, రూరల్ పరిధిలో ఉన్న రెండు దుకాణాల మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా విషయంలో తలెత్తిన వివాదాల కారణంగా ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలిసింది....ఈ వివాదాల మధ్య ఆటోలో తరలిస్తున్న మద్యం పట్టుబడినట్లు కూడా సమాచారం. మద్యం తరలిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో వైన్ షాపుల మధ్య ఉన్న విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది...
అధికారుల చర్యలపై ప్రశ్నలు..
గ్రామాలు, కాలనీల్లో బెల్ట్ షాపులు విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపుల ద్వారా మద్యం సులభంగా లభించడంతో యువత మద్యానికి బానిసలవుతున్నారని, కుటుంబాల్లో సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోదాడ మండలంలో జరుగుతున్న ఈ అక్రమ మద్యం వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా? లేక ఈ వ్యవహారం యథేచ్ఛగా కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.






