- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి చైర్మన్ ఛాంబర్ లో మందు పార్టీ.. బయటపడిన షాకింగ్ వీడియో
ఆర్థిక సంవత్సరం ముగింపు రోజున అర్ధరాత్రి వరకు స్థానిక సహకార సంఘాల్లోని ఉద్యోగులు లెక్కలు సరి చూస్తున్నామన్న ముసుగులో చైర్మన్ ఛాంబర్లోనే బరితెగించి మందు పార్టీ చేసుకున్న విషయం వెలుగు చూసింది.

దిశ, మోత్కూరు : ఆర్థిక సంవత్సరం ముగింపు రోజున అర్ధరాత్రి వరకు స్థానిక సహకార సంఘాల్లోని ఉద్యోగులు లెక్కలు సరి చూస్తున్నామన్న ముసుగులో చైర్మన్ ఛాంబర్లోనే బరితెగించి మందు పార్టీ చేసుకున్న విషయం వెలుగు చూసింది. మోత్కూరు సహకార సంఘంలో పనిచేసే ఒక ఉద్యోగి బాహాటంగా అడ్డ గూడూరులో పనిచేసే మిత్రులు కూడా రావాల్సి ఉందని చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. రుణాల పంపిణీకి సంబంధించిన బడ్జెట్ మిగిలిపోవడంతో దానిని తమకు ఎంతో అంతో ముట్ట చెప్పిన వారికి రుణాలు మంజూరు చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి పోవడంతో పీఎసీసీకి సంబంధించిన సీఈఓను మందు పార్టీలో పాల్గొన్న ఉద్యోగులతో పాటు జిల్లా సహకార అధికారిని కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు సమాచారం. సహకార సంఘం అంటేనే రైతులకు బాసటగా నిలవాల్సిన సిబ్బంది దళారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పూర్తి విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.






