మేడారం జాత‌ర‌లా.. గాజుల మ‌ల్కాపురంలో స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాతర‌

by Nallavelli.Anjaneyulu |

మేడారం జాత‌ర‌లా.. గాజుల మ‌ల్కాపురంలో స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జార‌త నిర్వ‌హిస్తున్న‌ట్టు దేవాల‌య క‌మిటీ చైర్మ‌న్ బండి మ‌ధుసూద‌న్ రెడ్డి, స‌ర్పంచ్ నాతాల వెంక‌ట్ రెడ్డి తెలిపారు.

మేడారం జాత‌ర‌లా.. గాజుల మ‌ల్కాపురంలో స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాతర‌
X

దిశ, పెన్ పహాడ్ : మేడారం జాత‌ర‌లా.. గాజుల మ‌ల్కాపురంలో స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జార‌త నిర్వ‌హిస్తున్న‌ట్టు దేవాల‌య క‌మిటీ చైర్మ‌న్ బండి మ‌ధుసూద‌న్ రెడ్డి, స‌ర్పంచ్ నాతాల వెంక‌ట్ రెడ్డి తెలిపారు. గురువారం స‌మ్మ‌క్క‌-సారల‌మ్మ జాత‌ర‌కు సంబంధించిన పోస్ట‌ర్ ను వారు ఆవి|ష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ పెన్ ప‌హాడ్ మండ‌లం గాజుల మ‌ల్కాపురంలో రెండేళ్ల‌కు ఒక‌సారి స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ మ‌హాజాత‌ర నాలుగు రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ జాతర కూడా గిరిజన సంస్కృతి, భక్తి, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. చుట్టు పక్కల జిల్లాల నుంచి మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రానున్నారని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. జాత‌ర‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా అన్న‌దానం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. భ‌క్తులంద‌రికీ ఉచిత భోజ‌నం ఏర్పాటు చేశారు. భ‌క్తుల‌కు ప్ర‌త్యేకంగా తాగునీరు, మ‌జ్జిగ‌, విశ్రాంతి స్థ‌లాలు ఏర్పాటు చేశారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్, కోలాటం వంటి సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, వివిధ క్రీడ‌లు, గ్రామీణ క్రీడ‌లు, బ‌హుమ‌తులు అంద‌జేస్తారు. ఈ జాతర ద్వారా గిరిజన సంప్రదాయాలు, సామూహిక భక్తి, సాంస్కృతిక వైవిధ్యం ప్రపంచానికి చాట బడుతుంది. భక్తులందరూ అమ్మవార్ల దర్శనం కోసం తపన పడి రావాలని, జాతర విజయవంతం కావాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మామిడి వెంకన్న, దేవాలయ కమిటీ కన్వీనర్ దేవి రెడ్డి మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ మండాది పాపయ్య, కుందూరు వెంకటరెడ్డి, మగ్దుమ్షా, కార్యదర్శి బచ్చలకూరి సైదులు, మాజీ ఉప సర్పంచ్ జాన్, రవీందర్ రెడ్డి, బచ్చలకూర లింగయ్య, బండి సుధాకర్ రెడ్డి, గోవర్ధన్, పాషా, వెంకట్ రెడ్డి, అంజయ్య, వరకాల అంజయ్య, శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.

Next Story