లిఫ్టులన్నీ త్వరలోనే పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్

by Bhanu |

రాష్ట్రంలో సాగునీటి లభ్యతను మెరుగుపరచేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

లిఫ్టులన్నీ త్వరలోనే పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్
X

దిశ, చింతలపాలెం: రాష్ట్రంలో సాగునీటి లభ్యతను మెరుగుపరచేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం చింతలపాలెం మండలంలోని అంజని సిమెంట్ ఆడిటోరియంలో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, నక్కగూడెం, రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పురోగతిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కృష్ణ జలాల పంపకంపై బ్రిజేష్ ట్రిబ్యునల్‌ పై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దక్షిణ తెలంగాణను ఎడారి ప్రాంతంగా మార్చాయన్నారు. కృష్ణా జలాల పంపకంలో న్యాయం జరగలేదని, కేసును తిరిగి తెరిపించి ట్రిబ్యునల్‌లో స్వయంగా వాదనలు వినిపిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు 70% వాటా సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ 2008లో ప్రారంభించి 2012లో పూర్తయిన ఈ పథకం 2018 తర్వాత మరమ్మతులు లేక రైతులు ఇబ్బందిపడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడది మళ్లీ 37.70 కోట్లతో పునరుద్ధరించి 3200 ఎకరాల సాగునీటిని అందించేందుకు 2025 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ - ఇందిరాగాంధీ ఎత్తిపోతల పథకం ఈ పథకం ద్వారా మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాల్లో మొత్తం 53,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. మొత్తం వ్యయం రూ.1450 కోట్లు కాగా, 2026 ఆగస్టు నాటికి పూర్తిచేయాలన్నారు.

రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఈ పథకానికి రూ.394 కోట్లు ఖర్చుతో మేళ్లచెర్వు, కోదాడ, హుజూర్నగర్, చింతలపాలెం, చిలుకూరు మండలాల్లోని 12 గ్రామాల్లో 14,100 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. 2026 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. మొత్తంగా మూడు పథకాల వల్ల 71,000 ఎకరాలు సాగులోకి వస్తుంది.ఈ మూడు పథకాల ద్వారా మొత్తం 71,000 ఎకరాలు సాగులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. భూసేకరణకు రైతులు సహకరించాలని, నష్టపరిహారం వెంటనే అందించబడుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఆర్థివో శ్రీనివాసులు, ఇరిగేషన్ సీఈ రమేష్ బాబు, ఎస్ఈ శివధర్మతేజ, డీఈలు చారి, హరికిషోర్, తహసీల్దార్ సురేందర్ రెడ్డి, ఎంపిడిఓ భూపాల్ రెడ్డి, నాయకులు దొండపాటి అప్పిరెడ్డి, చక్రధరరావు, నరాల కొండారెడ్డి, నంది రెడ్డి ఇంద్రారెడ్డి, దేవి రెడ్డి లక్ష్మారెడ్డి, వేములూరి రంగాచారి తదితరులు పాల్గొన్నారు.

Next Story