వీబీ జీ రామ్ జీ పథకాన్ని వ్యతిరేకిద్దాం : CPM

by Nallavelli.Anjaneyulu |

వీబీ జీ రామ్ జీ పథకాన్ని వ్యతిరేకిద్దామ‌ని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.

వీబీ జీ రామ్ జీ  పథకాన్ని వ్యతిరేకిద్దాం : CPM
X

దిశ‌, మున‌గాల : 2005లో వామ‌ప‌క్షాల ఒత్తిడితో సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి మోడీ సర్కార్ వీబీ జీ రామ్ జీ పేరుతో నూతన చట్టం తెచ్చిందని.. ఇది ప్రజా వ్యతిరేకమైన చట్టమని దాని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల ముందు ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం మునగాల మండల కేంద్రంలో కొక్కిరేణి సెంటర్ రోడ్డు నందు మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురాటం సరైనది కాదన్నారు మోడీ అధికారం లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రైంతాగ‌, కార్మిక, వ్యవసాయ కార్మిక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు అనుసరిస్తున్నారని తెలిపారు. గాంధీని హత్య చేసిన గాడ్సే పేరుతో జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురాటం అన్యాయం అన్నారు. దేశ ప్రజలందరూ ఐక్యమై మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు, సీపీఎం మండల కార్యదర్శి గురు శ్రీరాములు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, షేక్ సైదా, మండల కమిటీ సభ్యులు చందా చంద్రయ్య, సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు, వీరబోయిన వెంకన్న, అనంత గురువయ్య, తుమ్మ సతీష్, సోమపొంగు నరసయ్య ,ఉపసర్పంచ్ మొగిలిచర్ల సీతారాములు, మామిడి గోపయ్య, సోమపంగు, జానయ్య, బట్టు నాగయ్య, అరె రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Next Story