- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే మండలం ఇద్దరు అధ్యక్షులు.. కాంగ్రెస్‌లో తారాస్థాయికి చేరిన వర్గపోరు
రాష్ట్రంలో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీకి కింది స్థాయిలో మాత్రం వర్గపోరు తప్పడం లేదు.

దిశ, వలిగొండ: రాష్ట్రంలో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీకి కింది స్థాయిలో మాత్రం వర్గపోరు తప్పడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే మండలానికి ఇద్దరు మండల అధ్యక్షులు కొనసాగుతుండటం పార్టీలో గందరగోళంగా మారింది. వలిగొండ మండలం కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరుతో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. తాజాగా వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎం తుర్కపల్లి గ్రామానికి చెందిన తుమ్మల యుగేందర్ రెడ్డిని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి నియామక పత్రాలు అందజేశారు. కాగా, తుమ్మల యుగంధర్ రెడ్డి నియమించిన రెండు, మూడు రోజులకే తానే మండల పార్టీ అధ్యక్షుడినని, తనకు పీసీసీ తరఫున అందించిన నియామక పత్రం ఉందని, రెండేళ్ల పాటు తానే మండల అధ్యక్షుడిని అని పాశం సత్తిరెడ్డి విలేకరుల సమావేశం ద్వారా తెలియజేశారు.
సోమవారం గాంధీ జయంతి వేడుకలను కూడా ఒకే పార్టీ నుండి ఇద్దరు మండల అధ్యక్షులు వేర్వేరుగా నిర్వహించారు. దీంతో రానున్న రోజుల్లో ఈ గ్రూపులు మరింత బలపడే అవకాశం ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిపై ప్రభావం చూపి పార్టీకి నష్టం కలిగిస్తాయని జిల్లా పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇరువర్గాల ముఖ్య నేతలు మాత్రం అధిష్టానం ఎవరికీ టికెట్టు కేటాయిస్తే వారి గెలుపునకు కృషి చేస్తామని అంటున్నారు.






