- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగాలపేరుతో మోసం చేసిన లాయర్ పై కేసు
కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మహిళల నుంచి డబ్బు తీసుకుని మోసం చేసి మహిళా లాయర్ పై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివ రాంరెడ్డి వెల్లడించారు.

దిశ, నల్లగొండ క్రైం: కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మహిళల నుంచి డబ్బు తీసుకుని మోసం చేసి మహిళా లాయర్ పై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివ రాంరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన దిశతో మాట్లాడుతూ కోర్టులో స్వీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఒక్కొక్కరినుంచి రూ.50వేలు తీసుకుని, ఇలా 40మంది నుంచి రూ.20లక్షల వరకూ మోసం చేసినట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. తిప్పర్తి, నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లలో మోసం చేసిన గాజుల జ్యోతిపై బాధితులు ఫిర్యాదులు చేశారని, కేసు నమోదు చేసి రెండు టీంలను ఏర్పాటు చేసి నిందితురాలిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే నిర్భయంగా ముందుకువచ్చి సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. కాగా, ‘ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా’ అనే కథనంతో దిశ పత్రిక ఈ నెల 7వ తేదీన మోసంచేసిన విధానంపై వెలుగులోకి తెచ్చింది. దిశ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్ గా తీసుకుని, విచారణ వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సమాచారం.






