- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ ఢీ.. దంపతుల మృతి
లారీ ఢీకొన్న ప్రమాదంలో దంపతులు మృతి చెందిన సంఘటన హాలియా పట్టణంలో చోటుచేసుకుంది.

X
దిశ, హలియా : లారీ ఢీ కొన్న ప్రమాదంలో దంపతులు మృతి చెందిన సంఘటన హాలియా పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పిట్టల వెంకటయ్య (55) పిట్టల మల్లమ్మ (50) దంపతులిద్దరూ మంగళవారం మధ్యాహ్నం స్వగ్రామం నుంచి అనుముల మండలం కొట్టాల గ్రామంలో ఉన్న వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా హాలియా ఎడమ కాలువ వంతెనపై లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటన విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






