సురభి నాటకాల లాగా కేటీఆర్, హరీష్ రావు తీరు : డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత

by Nallavelli.Anjaneyulu |

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న రాజకీయాల తీరు సురభి నాటకాల లాగా ఉన్నాయని నల్లగొండ జిల్లా

సురభి నాటకాల లాగా కేటీఆర్, హరీష్ రావు తీరు :  డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న రాజకీయాల తీరు సురభి నాటకాల లాగా ఉన్నాయని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆరోపించారు. అధికారం లేనప్పుడు మాత్రమే కృష్ణా జలాలు గుర్తుకు వస్తాయని, అధికారం కోల్పోయిన కెసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ లకు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. బుధవారం నల్గొండ కేంద్రంలో ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన అవాకులు చవాకులు, చూస్తే కాంగ్రెస్ నాయకులకు ఆవేశం వస్తుందని అన్నారు. వారు చేసిన వ్యాఖ్యలలో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా ఇంకా సిగ్గు రాలేదని కేసీఆర్ నీ ఫామ్ హౌస్ కుపరిమితం చేసింది రేవంత్ రెడ్డి కాదా అని నిలదీశారు. సిగ్గు లజ్జా లేకుండా నేడు కృష్ణ జలాలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు 299 టీఎంసీలకు సంతకం పెట్టింది నీ అయ్యా కేసీఆర్ కాదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఎత్తు తగ్గించి తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్ అని అన్నారు. ఎస్ ఎల్ బి సి సొరంగం పనులు 10 సంవత్సరాల కాలంలో తట్టెడు మట్టి అయినా తీశారా అని ప్రశ్నించారు. చర్లగూడెం నెల్లికల్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని కృష్ణరాంపల్లి, ఉదయ సముద్రం గ్రామంలో ప్రాజెక్టును ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలను శాశ్వతంగా ఎడారి చేయాలని కేసిఆర్ లో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. జిల్లా మంత్రులైన ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాయకత్వంలో జిల్లా సశ్యామలం అవుతుందన్నారు. రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రైతులు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని పోటీ చేసి సిగ్గు లేకుండా మళ్లీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికలలో 60 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని మొన్న జరిగిన, కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం చూపి విజయాన్ని అందించారని అన్నారు.


పార్టీలో నాయకత్వం కోసం, కవిత కేటీఆర్, హరీష్ రావులు తన్నుకుంటున్నది ప్రజలు చూస్తున్నారని అన్నారు. నాడు ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణలోని ప్రాజెక్టులు కట్టబెట్టి కమిషన్లు తీసుకున్న ఘనత హరీష్ రావుకు ఉందని అన్నారు. 23వ పులికేసి లెక్క కేటీఆర్ హరీష్ రావుల, బ్రోకర్ రాజకీయం ఉందని అన్నారు. బీసీలకు అన్యాయం చేసి నేడు మళ్ళీ ఎం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని అన్నారు. కంచర్ల భూపాల్ రెడ్డి వ్యాకలు చూస్తే డ్రైనేజీ లో చెత్తలాగా ఉన్నాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై గాదరి కిషోర్ చేస్తున్న మాటలు అహంకారానికి నిదర్శనమని, బాల్క సుమన్, సంతోష రావులకు పదవులు వస్తే తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగ సమస్య తీరుతుందా ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోక పోతే తన్ని తరుముతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కన్నారావు, ఎస్ఎస్సి జిల్లా అధ్యక్షుడు బోడ స్వామి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్, చింతమల్ల వెంకటయ్య, పుట్ట వెంకన్న గౌడ్, తిరుమలేష్, శివ గౌడ్, నరేష్, కర్నాటి మత్స్యగిరి, వేణు, సైదులు ఉన్నారు.

Next Story