- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండకు కేటీఆర్ ఎంట్రీ.. గులాబీమయంగా క్లాక్ టవర్ సెంటర్
నేడు నల్లగొండ జిల్లా కేంద్రంలో తలపెట్టిన రైతు మహాధర్నాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.

దిశ, నల్లగొండ బ్యూరో : నేడు నల్లగొండ జిల్లా కేంద్రంలో తలపెట్టిన రైతు మహాధర్నాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఆయనకు నల్లగొం జిల్లా పార్టీ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. కేటీఆర్ రాక సందర్భంగా నాగార్జున డిగ్రీ కాలేజ్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. ఓపెన్ టాప్ జీపులో కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రజలకు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన గులాబీ శ్రేణులు కేటీఆర్ పై పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు. మరోవైపు ధర్నా కార్యక్రమం జరిగే క్లాక్ టవర్ సెంటర్ వేలాదిమంది కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. కళాకారులు ఆలపిస్తున్న గీతాలతో ప్రాంగణమంతా దద్దరిల్లింది. పట్టణంలో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.






